కరోనా బాధితులను ఆదుకునేందుకు నేనున్నానంటూ ఎల్లప్పుడు ఆపన్నహస్తం అందిస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. తాజాగా మరోసారి రెండోదశలో వైరస్ విజృంభిణతో కొవిడ్ సోకిన వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ములుగు జిల్లా కొత్తూరు గ్రామములో కొవిడ్ బాధితులకు సాయమందించారు.
నేనున్నానంటూ పేదల ఆకలి తీరుస్తున్న సీతక్క - కొవిడ్ సోకిన వారికి నిత్యావసరాల పంపిణీ
ఆకలితో కడుపు ఖాళీగా ఉండకూడదన్నదే ఆమె లక్ష్యం. అందుకోసం ఎంతదూరమైన కాలినడకతోనే వెళ్తుంది. కొండ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అన్నీ తానై ఆదరిస్తుంది. మొదటి దశ కరోనా వైరస్ వచ్చినప్పుడు వేలమందికి నిత్యావసర సరుకులు అందించింది. మరోసారి మహమ్మారి విజృంభణతో బాధితులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.
కొవిడ్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
కరోనా బాధితులకు బియ్యం, పప్పు, నూనె, మాస్కులను ఎమ్మెల్యే సీతక్క అందజేశారు. వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ మహమ్మారిని తరిమి కొట్టాలని.. అవసరమైతే తప్పా ఇంట్లో నుంచి బయటకు రావద్దని వివరించారు. ప్రతి ఒ్కకరూ తప్పకుండా మాస్కులు ధరించాలని కొత్తూరులో కొవిడ్ సోకి మరణించిన కొర్ర సది, కంచే కుమారస్వామి, కుటుంబాలను పరామర్శించి నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.