తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాణాలు పోయినా పట్టించుకోరా.. మీకు నీళ్లొస్తే చాలా..?'

రోడ్డు కొట్టుకుపోతోన్న.. ప్రజా ప్రతినిధులు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదంటూ ములుగు జిల్లాలోని కేశవాపూర్​ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

negligence of the authorities
రహదారులను బాగు చేయాలి

By

Published : Apr 12, 2021, 5:30 PM IST

స్థానిక రాజకీయ నాయకులు.. నీటి కోసం పోట్లాడుకోవడం తప్ప, ధ్వంసమైన రోడ్డును పట్టించుకోవడం లేదంటూ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని కేశవాపూర్ గ్రామస్థులు మండిపడ్డారు. అధికారులకు నీటి మీద ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిని తక్షణమే బాగు చేయాలని డిమాండ్ చేశారు.

మండలంలోని వంగపల్లి చెరువులోకి.. గ్రావిటీ కాలువ ద్వారా అధికారులు రామప్ప సరస్సు నుంచి నీటిని తరలిస్తున్నారు. గత వర్షాకాలంలో.. వరదలకు సగం రోడ్డు కొట్టుకుపోయి గోతి ఏర్పడింది. వచ్చీ పోయే వాహనదారులు కుంటలో పడి గాయాలపాలవుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు.. ఇప్పటికైనా రహదారిని పూర్తి చేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:చల్లబడిన భానుడు... చిరుజల్లులతో వరుణుడు

ABOUT THE AUTHOR

...view details