ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపెళ్లి గ్రామంలో ములుగు జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ బడే నాగజ్యోతి వివాహం నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆ వివాహానికి తాడ్వాయి ఎంఆర్ఓ శ్రీనివాస్ 20 మందితో వివాహం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కొద్దిమంది సమక్షంలో వివాహం చేసుకున్నారు.
20మంది సమక్షంలో జడ్పీ వైస్ చైర్మన్ పెళ్లి - పెళ్లి చేసుకున్న జడ్పీ వైస్ ఛైర్మన్ బడే నాగజ్యోతి
ఆవిడ ఓ జిల్లాకు జడ్పీ వైస్ ఛైర్మన్.. కానీ హంగులు ఆర్భాటాలు లేకుండా గ్రామంలో పెళ్లి చేసుకున్నారు. లాక్డౌన్ కారణంగా భౌతిక దూరం పాటిస్తూ 20 మంది సమక్షంలో పెళ్లి జరుపుకున్నారు. ఆశీర్వదించాడానికి వచ్చిన నాయకులు సైతం అక్కడకు వచ్చిన వారికి మాస్కులు పంపిణీ చేశారు.
![20మంది సమక్షంలో జడ్పీ వైస్ చైర్మన్ పెళ్లి mulugu district zp vice chairman naga jyothi ideal marriage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7221515-108-7221515-1589620042554.jpg)
దివంగత మాజీ నక్సలైట్లలో అగ్ర నాయకునిగా పనిచేసిన కాల్వపల్లికి చెందిన బడే ప్రభాకర్, అలియాస్ నాగేశ్వరరావు కూతురే బడే నాగజ్యోతి. బంధువులు, పార్టీ నాయకులు భౌతిక దూరం పాటిస్తూ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. తెరాస నాయకులు బంధు మిత్రులకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వ్యాధి కారణంగా కేంద్ర, రాష్ట్రాల ఆదేశాల మేరకు వివాహ వేడుకల్లో ఎక్కువమంది పాల్గొనలేదు. భౌతిక దూరం పాటిస్తూ వివాహం జరిగిందని వచ్చిన తెరాస పార్టీ నాయకులు, వివాహిత బడే నాగజ్యోతి అన్నారు.
ఇదీ చూడండి :దయనీయంగా మారిన వృద్ధాశ్రమాల పరిస్థితి