ములుగు జిల్లాలో చిరుత సంచారంతో....అటవీ ప్రాంత సమీప గ్రామస్థులు భయం భయంగా రోజులు గడుపుతున్నారు. సాయంత్రమైతే బయటకి వచ్చేందుకు జంకుతున్నారు. వాజేడు మండలం కొంగాల, దూలాపూరం మధ్యలో జామాయిల్ తోటలో.... చిరుత ఓ లేగదూడను చంపడం....అందరిలోనూ భయం రేకెత్తించింది. లేగదూడ అరుపులు విని...పశువుల కాపర్లు పరిగెత్తుకు రావడంతో...చిరుత అడవిలోకి పరుగుతీసింది.
పదిహేను రోజుల క్రితం తొలిసారిగా ఈ ప్రాంతంలో చిరుత సంచారం...వెలుగులోకి వచ్చింది. వాజేడు మండలం...కొంగాల అటవీ ప్రాంతంలో...చిటారు కొమ్మనెక్కిన చిరుత...గ్రామస్తుల కంట బడింది. వారంతా కేకలు వేయడం...పెద్దగా శబ్దాలు చేయడంతో...అది సమీప అటవీ ప్రాంతంలోకి పరిగెత్తింది.