భారత స్వాతంత్య్ర సంబరం ఒక మహోజ్వల ఘట్టమని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. 75వ భారత స్వతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కవి సమ్మేళనంలో... అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'ములుగు పోరాటాలకే కాదు.. సాహితీవేత్తలకు కూడా ప్రసిద్ధి' - 75th independence celebrations
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం
ప్రతి ఉద్యమంలో సాహిత్య, సాంస్కృతిక రూపాలు ప్రజలను అందులో పాల్గొనేలా చేస్తాయన్నారు. ములుగు జిల్లా పోరాటాలకు మాత్రమే కాకుండా సాహితీ వేత్తలు కూడా ప్రసిద్ధి అని కొనియాడారు. ఆనాటి అమరుల స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు. కవి సమ్మేళనంలో 50 మంది కవులు, గాయకులు ఉత్తమ కవిత్వం పఠనం చేశారు.
ఇదీ చదవండి:శంషాబాద్ విమానాశ్రయంలో 'జీఎంఆర్ ఇన్నోవెక్స్’ కేంద్రం