తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు కలెక్టర్​ నారాయణరెడ్డి ఆకస్మిక బదిలీ - MULUGU DISTRICT COLLECTOR TRANSFERRED TO NIZAMABAD

జిల్లా అభివృద్ధికి ఎన్నో చర్యలు... పారిశుద్ధ్యానికి,  ప్లాస్టిక్​ నివారణకు మరెన్నో కార్యాచరణలు... మేడారం జాతర కోసం ప్రణాళికలు వేసి తనదైన ముద్ర వేసిన ములుగు పాలనాధికారి​ నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. నిజామాబాద్​కు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

MULUGU DISTRICT COLLECTOR TRANSFERRED TO NIZAMABAD
MULUGU DISTRICT COLLECTOR TRANSFERRED TO NIZAMABAD

By

Published : Dec 23, 2019, 3:20 PM IST

ములుగు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్గొండ జిల్లా జాయింట్​ కలెక్టర్​గా సేవలందిస్తోన్న నారాయణరెడ్డి... 2019 మార్చి 4న ములుగు జిల్లా పాలనాధికారి​గా బాధ్యతలు స్వీకరించారు.

ములుగు జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అనేక మంచి పనులతో ముందుకు సాగుతూ తనదైన ముద్ర వేసుకున్న నారాయణరెడ్డిని ఏడాది తిరక్కుండానే బదిలీ చేయటంలో ఆంతర్యమేంటని స్థానికుల్లో సందేహాలు మొదలయ్యాయి. మేడారం జాతరను మునుపెన్నడూ లేని విధంగా జరిపించాలన్న కార్యదీక్షతో పనిచేస్తోన్న కలెక్టర్​ను ఇలా బదిలీ చేయటం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ములుగు కలెక్టర్​ నారాయణరెడ్డి ఆకస్మిక బదిలీ...

నిజామాబాద్​లో జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు ఉండటం, దీర్ఘకాలంగా కొనసాగుతోన్న పసుపు రైతుల సమస్యల దృష్ట్యా... నారాయణ రెడ్డిని నియమించినట్లు సమాచారం.

ఇదీ చూడండి:పాన్​-ఆధార్​ అనుసంధానానికి గడువు దగ్గరపడింది!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details