ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాల వైపు యువత దృష్టిసారించాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని చెప్పారు. గ్రామ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
పత్తిపల్లి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చడానికి ముందడుగు వేసిన యువతను కలెక్టర్ అభినందించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దరిచేరవని, ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ అన్నారు. గ్రామాలు స్వచ్ఛతలో ముందుంటే అభివృద్ధికి నాంది పలికినట్లేనని చెప్పారు.