' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా ' - mulugu collcetor to advice shopkeeprs
పర్యావరణానికి ముప్పు తలపెట్టే ప్లాస్టిక్ కవర్స్‌ను అందరూ నిషేధించాలని ములుగు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు.
![' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా '](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4877310-284-4877310-1572093309114.jpg)
' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా '
ములుగు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలను ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించారు. షాపులన్నీ తిరుగుతూ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని యజమానులకు సూచించారు. దీపావళి రోజు నుంచి ప్లాస్టిక్ నియంత్రణ అమలవుతుందని... తరువాత ఎవరైనా వాడితే వారికి ఐదు వేల రూపాయల జరిమానా వేయడం జరుగుతుందని హెచ్చరించారు. పర్యావరణానికి ముప్పు తలపెట్టే ప్లాస్టిక్ కవర్స్‌ను నిషేదించేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు.
' దీపావళి తర్వాత ప్లాస్టిక్ వాడితే జరిమానా '