అర్హులైన యువతీ, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఉపయోగపడుతుందని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఓటరు నమోదు కార్యక్రమంలో రెవెన్యూ, అంగన్వాడీ టీచర్లతో ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకి బహుమతులు అందజేశారు.
జాతీయ ఓటర్ దినోత్సవంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మార్వో సత్యనారాయణతో పాటు మరికొంత మంది ఉద్యోగులకు అవార్డు అందించారు. సీనియర్ సిటిజన్స్ని సన్మానించారు.