ఉపాధి హామీ, హరితహారం నిర్వహణకు సంభంధించిన కార్యాచరణ మీద ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నాతాధికారులతో కలెక్టర్ కృష్ణ ఆదిత్య సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అడవులలో నివసిస్తున్న గుత్తి కోయ, గిరిజనులకు తాగునీటి వసతి లేక, రోడ్డు మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి పనుల్లో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని బీడు భూముల్లో హరితహారం మొక్కలు నాటితే బాగుంటుందని ఆమె అన్నారు. అడవుల్లో నివసిస్తున్న గిరి పుత్రులకు ఉపాధి కలిగే ఇప్ప, కానుగ, సీతాపల, తునికి, రేగు మొక్కలు నాటితే ఉపయోగరకంగా ఉంటుందని ఆమె కోరారు.
ఎన్నో ఏళ్లుగా అడవిని నరికి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు పట్టా ఉన్నప్పటికీ.. ఆ భూములను ఫారెస్ట్ అధికారులు లాక్కొని మొక్కలు నాటడం సరి కాదని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా ఏజెన్సీ గ్రామాల్లో కొత్తగా పోడు చేయకూడదని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సీతక్క డిమాండ్లకు మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. జిల్లాలో 10 వేల హెక్టార్లలో మొక్కలు నాటాలని ..అవి కూడా అడవిలో నివసిస్తున్న గిరిజనులకు ఉపాధి కలిగే మొక్కలు నాటాలని ఆమె సూచించారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు, బంక, చీపురు, తునికి పండ్లు, ఎలుకపండ్లు లాంటి నాటితే.. అవి అమ్ముకుని గిరిజనులు జీవనం సాగిస్తారని ఆమె అన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు ఐటీడీఏ అధికారులు సంయుక్త విచారణ జరిపి పట్టాపుస్తకాలు అందించాలని ఆదేశించారు. ఉపాధి హామీ మీ పనులు అటవీ ప్రాంతంలో వర్షాకాలంలో మొక్కలకు నీటి నిల్వ ఉండేలా గోతులు చేయించామని.. దీంతో విస్తృతంగా అడవి అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.