తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐదు రోజుల్లో భూ ప్రక్షాళన ప్రక్రియ పూర్తికావాలి'

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్,​ ఐటీడీఏ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, సాదాబైనామా, పార్ట్​ బీ తదితర వాటిపై ఆరా తీశారు. రికార్డుల నివేదిక లేదని గ్రహించిన అధికారులు.. తహసీల్దార్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

mulugu, collector, mro office
ములుగు, తహసీల్దార్​ కార్యాలయం, కన్నాయిగూడెం

By

Published : Jan 10, 2021, 8:06 PM IST

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్​ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ ఏపీఓ హనుమంతు ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు, సాదాబైనామా, పార్ట్​ బీలో ఎన్ని రికార్డు చేశారు.. తదితర వాటిని తహసీల్దార్​ దేవసింగ్​ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములపై ఆరా తీశారు.

సంబంధిత ప్రశ్నలపై సరైన రికార్డుల నివేదిక చూపించకపోవడంతో తహసీల్దార్​పై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన ఐదు రోజుల్లో పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:బస్వాపూర్​ రిజర్వాయర్​ పనులపై స్మితా సబర్వాల్ ఆరా

ABOUT THE AUTHOR

...view details