మేడారం జాతర పనులను నాణ్యతలేమిపై పరిశీలనకు ఇంఛార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కన్నెపల్లి-ఊరట్టం రోడ్డును పరిశీలించిన పాలనాధికారి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ రమేశ్‌ను సస్పెండ్ చేశారు. డీఈ రవీందర్, ఈఈ రాంబాబులకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.
తాత్కాలిక పనులతోపాటు, శాశ్వత నిర్మాణంలోనూ నాణ్యతలేని మెటల్ వేస్తుండటాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 9న ఈనాడు-ఈటీవీ భారత్ ప్రచురించిన 'మేడారం పనులు తారుమారు' కథనంపై స్పందించిన కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు.