ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లి వద్ద మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపాయి. పీఎల్జీఏ 17వ వారోత్సవాల ఘనంగా జరుపుకోవాలని కరపత్రాల్లో సూచించారు. గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు. అలాగే పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఉన్న వారిని ప్రజలు శిక్షించాలని కోరారు.
తాడ్వాయిలో మావోయిస్టు కరపత్రాల కలకలం - మావోయిస్టుల కరపత్రాలు తాజావార్తలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లి వద్ద మంగళవారం ఉదయం మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. పీఎల్జీఏ 17వ వారోత్సవాల ఘనంగా జరుపుకోవాలని కరపత్రాల్లో సూచించారు.

తాడ్వాయిలో మావోయిస్టు కరపత్రాల కలకలం
దోపిడీ పాలన వ్యవస్థను ప్రజలే అంతం చేయాలని పేర్కొన్నారు. ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకులు వచ్చిన పేదలకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు. చర్ల, శబరి ఏరియా కమిటీ నాయకుడి పేరుతో ఈ కరపత్రాలు ఉన్నాయి.