రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ కుసుమ జగదీశ్వర్ రెడ్డి రామప్ప, గట్టమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లాలోని వెంకటపురం మండలం రామప్ప ఆలయానికి రూ.70 లక్షల రూపాయలతో ప్రవేశ ద్వారం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రామప్ప, గట్టమ్మ తల్లి ఆలయ పరిసరాల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలతో కలిసి మొక్కలు నాటారు. రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని మొక్కుకున్నట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కేటీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన ఎమ్మెల్సీ పోచంపల్లి - ములుగు జిల్లా వార్తలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ములుగు జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ కుసుమ జగదీశ్వర్ రెడ్డితో కలిసి రామప్ప, గట్టమ్మ ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు.
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్సీ పోచంపల్లి