ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గిరిజనులకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేయూత అందించారు. ఖమ్మంలో జీటీఎస్ఎస్ ఛైర్మన్ జాకప్ సహకారంతో ఎమ్మెల్యే రెండు వందల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఇప్పటికీ వారి ఖాతాల్లో జమ కాలేదన్నారు. రూ.15 వందల సాయం అందేలా చూడాలని కోరారు.
బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీరయ్య - వెంకటాపురం, వాజేడు మండలాల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య బియ్యం పంపిణీ
వెంకటాపురం, వాజేడు మండలాల్లో తిరుగుతూ.. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గిరిజన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీరయ్య
మాజీ సర్పంచ్ రౌతు నరసింహ, కాంగ్రెస్ నాయకులు 1155 కుటుంబాలకు ఐదు రకాల కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:'పోస్ట్ ఇన్ఫో'తో ఔషధాలు, మాస్కులు డోర్ డెలివరీ