ఎమ్మెల్యే సీతక్కను ములుగులోని ఎమ్మెల్యే క్వార్టర్లో గృహనిర్బంధం చేశారు. కన్నాయిగూడెం మండలంలో దేవాదుల వద్ద తలపెట్టిన జలదీక్షకు ములుగు నుంచి బయల్దేరేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు.
గృహ నిర్బంధంలో ఎమ్మెల్యే సీతక్క - గృహ నిర్బంధంలో ఎమ్మెల్యే సీతక్క
జల దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కన్నాయిగూడెం మండలంలో దేవాదుల వద్ద తలపెట్టిన జలదీక్షకు ములుగు నుంచి బయల్దేరేందుకు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు.
గృహ నిర్బంధంలో ఎమ్మెల్యే సీతక్క
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొత్తం గోదావరి పరివాహాక ప్రాంతాలకు నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని సీతక్క ఆరోపించారు. ములుగు ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ