తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చండి : ఎమ్మెల్యే సీతక్క - mulugu mla seethakka

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలతో సర్కార్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ములుగు మండలంలోని జకారం వైటీసీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు.

mulugu district news, mulugu mla seethakka, mla seethakka, jakaram quarantine center
ములుగు జిల్లా వార్తలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ములుగులో కరోనా వ్యాప్తి

By

Published : Apr 30, 2021, 12:45 PM IST

ములుగు మండలంలోని జకారం వైటీసీలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సీతక్క సందర్శించారు. కొవిడ్ బాధితులు ధైర్యంగా ఉండి.. ఎలాంటి అసౌకర్యాలు కలిగినా.. తనకు చెబితే.. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 120మంది రోగులకు సీతక్క ఒక్క పూట భోజనం అందించారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. పేదల ప్రాణాలతో సర్కార్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details