ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. గత మేడారం జాతరలో వన దేవతలను మొక్కిన మొక్కు తీరిందని.. రేవంత్ రెడ్డికి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు.
MLA SEETHAKKA: 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తాం' - mulugu district latest news
గత మేడారం జాతరలో వన దేవతలను మొక్కిన మొక్కు తీరిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా రేవంత్ రెడ్డిని నియమించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కలిసి పని చేయాలని తెలిపారు.
MLA SEETHAKKA:'వన దేవతలను మొక్కిన మొక్కు తీరింది'
రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కలిసి పని చేయాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, మాజీ జడ్పీటీసీ బొల్లు దేవేందర్, సహకార సంఘం ఛైర్మన్ పులి సంపత్ గౌడ్, జిల్లా నాయకులు అర్రెం లచ్చు పటేల్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పీరీల వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల