ములుగు జిల్లా ములుగు మండలంలోని భూపాల్ నగర్ గ్రామ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1200 మొక్కలు నాటేలా అటవీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఎస్పీ సంగ్రామ్ సింగ్, జడ్పీ ఛైర్పర్సన్ కుసుమ జగదీశ్‌లు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి... ప్రకృతిని కాపాడాలని ప్రజాప్రతినిధులు సూచించారు.
'మొక్కలు నాటుదాం... ప్రకృతిని కాపాడుదాం' - హరిత హారం వార్తలు
ములుగు జిల్లా కేంద్రంలోని భూపాల్ ప్లాంటేషన్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.
'మొక్కలు నాటుదాం... ప్రకృతిని కాపాడుదాం'