ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గొల్లపల్లి గ్రామంలో 40 మంది నిరుపేద కుటుంబాలకు, చిన్నబోయినపల్లి గ్రామంలో 50 మంది దినుసరి కూలీలకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర వస్తువులు అందించారు. ఐదు కిలోల బియ్యం, కూరగాయలు, తదితర వంట సామాగ్రి అందించారు.
నిత్యావసరాలైనా దూరం పాటిస్తూనే తీసుకోండి: సీతక్క - నిత్యావసర వస్తువులు
ఏటూరునాగారం మండలంలోని నిరుపేదలకు, దినసరి కూలీలలకు ఎమ్మెల్యే సీతక్క నిత్యవసర వస్తువులు అందించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
నిత్యావసరాలైనా దూరం పాటిస్తూనే తీసుకోండి: సీతక్క
లాక్డౌన్ కారణంగా ఎన్నో కుటుంబాలు ఇంటిపట్టునే ఉంటున్నాయని... కనీసం నిత్యావసర వస్తువులు లేక అవస్థలు పడుతున్నారని సీతక్క తెలిపారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు దూరం పాటిస్తూ... నిత్యావసర వస్తువులు తీసుకోవాలని సూచించారు. దగ్గు, తుమ్ములు, జలుబు, జ్వరం వచ్చినట్లయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లి... వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ఇవీ చూడండి:50 మంది మీడియా, వైద్య సిబ్బందికి కరోనా