రామప్ప సరస్సు మత్తడి వెడల్పు పెంచాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రామప్ప సరస్సు జలకళ సంతరించుకుంది. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా... సరస్సు నీటి మట్టం 30 అడుగులు చేరుకోగా... ఎమ్మెల్యే సీతక్క ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఇంచెర్ల, జంగాలపల్లి, బండారుపల్లి, పాలబ్పల్లి, పాపయ్యపల్లి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.
రామప్ప సరస్సు మత్తడి వెడల్పు పెంచాలి: సీతక్క
ములుగు జిల్లాలోని రామప్ప సరస్సు పరివాహక ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. వరద కాలువల ప్రవాహ ఉద్ధృతిని పరిశీలించారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల సమీప గ్రామాలు ముంపునకు గురవుతాయని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.
mla seethakka visted ramappa pond
ఇప్పటికే వేలాది ఎకరాల్లో వేసిన పంట నీట మునిగిపోయిందన్నారు. సరస్సులో మునిగిన పంట పొలాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు. ములుగు నుంచి చత్తీస్ఘడ్ భూపాల్ పట్నం వెళ్లే జాతీయ రహదారి జంగాలపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పైన వరద నీరు చేరి ఇళ్లలోకి వస్తున్నాయని వివరించారు. రామప్ప మత్తడి వెడల్పు పెంచేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని సీతక్క కోరారు.