తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క - ఎమ్మెల్యే సీతక్క వార్తలు

ఎమ్మెల్యే సీతక్క సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రికి డయోగ్నోస్టిక్​ సెంటర్​ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

By

Published : Jun 11, 2021, 8:52 AM IST

కాంగ్రెస్ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు ఏరియా ఆస్పత్రికి డయోగ్నోస్టిక్​ సెంటర్​ను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, వాటర్ ఫాల్స్ అనేక పర్యాటక కేంద్రాలు, జాతీయ రహదారి ఉన్నా వెనుకబాటుకు గురైన ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం నర్సింగ్ కళాశాల మంజూరుకు కృషి చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా కష్ట కాలంలో పేద ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా కరోనాను ఆరోగ్య శ్రీ చేర్చాలని డిమాండ్​ చేశారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ములుగు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు జరగక వర్షాలకు పంట తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Surgical masks: కరోనా కట్టడిలో ఈ మాస్కులు మంచివే!

ABOUT THE AUTHOR

...view details