మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి తీరుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న తన అమ్మకు రక్తం అందించేందుకు వెళ్తున్న తమ బంధువులను అనుమతి ఉన్నా అడ్డుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు వారిని రోడ్డుపక్కన నిల్చోబెట్టారని వాపోయారు. తాను వీడియో కాల్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదన్నారు. ఓ ఎమ్మెల్యేనైన తనకే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
మా అమ్మకు ఆరోగ్యం సీరియస్గా ఉండి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందస్తు అనుమతితో వెళ్తున్న మా కుటుంబ సభ్యులను మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకొని దురుసుగా మాట్లాడారు. అర్ధగంటసేపు రోడ్డుపక్కకు నిలబెట్టారు. నేను వీడియో కాల్ చేసినా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ మా వాళ్లతో దురుసుగా ప్రవర్తించారు.