ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క శ్రమదానంలో పాల్గొన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో ఖాళీగా ఉన్న స్థలంలో మట్టి చల్లి... సరిచేశారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ములుగులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క శ్రమదానం చేశారు. క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న చోట మట్టి చల్లి మొక్కలు నాటారు.
హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే సీతక్క శ్రమదానం
రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని.. అనంతరం వాటి సంరక్షణ బాధ్యతను వహించాలని సీతక్క కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆమె సూచించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!