MLA Seethakka : ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క, బల్మూరి వెంకట్‌ను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి... నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
సీతక్క ఫైర్
పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ... పోలీసు స్టేషన్లోనూ సీతక్క ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిందని... రికార్డ్ చేసిన ఆదివాసి ఉద్యోగులకు స్థానికంగానే బదిలీల ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రోస్టర్ విధానం పాటించకుండానే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు ప్రభుత్వం తూట్లు పొడిచిందని సీతక్క విమర్శించారు.
'ఉద్యోగులను, వాళ్ల కుటుంబాలను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి... ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన బదిలీలు చేపట్టాలని కోరుతున్నాం. జూనియర్లకు అటవీ ప్రాంతంలో... సీనియర్లకు ప్లేన్ ఏరియాలకు బదిలీ చేస్తున్నారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఉద్యోగిని హైదరాబాద్‌కు తీసుకొస్తే వారు ఎలా అడ్జస్ట్ అవుతారు. జూనియర్లను అటవీ ప్రాంతానికి వస్తే కొత్త పోస్టులకు ఖాళీలు ఏర్పడవు. మరి అక్కడ చదువుకున్న వాళ్లు ఏం అవుతారు? రిక్రూట్మెంట్ అంతా ఒకవైపు, రిటైర్మెంట్ అంతా ఒకవైపు అవుతారు. ఉద్యోగులతో చర్చలు జరపాలి. జీవో 317ను రద్దు చేయాలి. ప్రశ్నిస్తే ప్రజా గొంతుకలు నొక్కేస్తున్నారు.'
-సీతక్క, ములుగు ఎమ్మెల్యే