ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్ నగర్ గ్రామ సమీపంలోని ఆదివాసీ గుత్తికోయగూడెం అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గురువారం జరిగిన ఈ ఘటనలో మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాల్ని సీతక్క పరామర్శించారు. బియ్యం, దుప్పట్లు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు అందించారు.
అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లా ప్రాజెక్ట్ నగర్ గ్రామ సమీపంలోని గుత్తికోయగూడెం అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. బాధిత కుటుంబాలను పరామర్శించి... నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.
అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే సీతక్క
అనంతరం ప్రాజెక్ట్ నగర్ గ్రామంలోని శివాలయంలో సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రపంచ ఆలయాల్లో యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది: సీఎం