కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోజువారీ కూలీల ఇక్కట్ల నెరిగి వారి ఆకలిదప్పికలను తీర్చడానికి ఎమ్మెల్యే సీతక్క ముందుకొచ్చారు. ములుగు జిల్లాలోని గడిగడ్డలో నివసిస్తున్న 60 మంది కూలీలలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం పప్పులు కూరగాయలను ఆమె పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఉన్న నిరుపేద గిరిజన గూడెం ప్రజలకు రేపటి నుంచి బియ్యం కూరగాయలు తదితర సామాగ్రిని అందజేయనున్నట్టు ఆమె తెలిపారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క - కరోనా నివారణ చర్యలు
లాక్డౌన్ నేపథ్యంలో ములుగు జిల్లాలోని ప్రజలకు పలువురు రాజకీయ నాయకులు అండగా ఉంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రోజు వారీ కూలీలకు నిత్యావసరాలైన బియ్యం, ఉప్పు పప్పులు, కూరగాయలు ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేస్తున్నారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క
మరో పక్క ములుగులోని భాజపా నాయకులు 50 మంది నిరుపేద కుటుంబాలకు, ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులకు, చెక్‌పోస్టు వద్ద వేచి పోలీసులకు భోజనాలను ఏర్పాటు చేసి దాదృత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి:విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి