ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో 160 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసరాలను అందజేశారు. ఒక్కొ కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు, పప్పులు, వంట సామాగ్రిని అందజేశారు.
160 కుటుంబాలకు సాయం చేసిన ఎమ్మెల్యే సీతక్క - mulugu district latest news today
లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలీలకు సాయం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో 160 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క సరకులను పంపిణీ చేశారు.
160 కుటుంబాలకు సాయం చేసిన ఎమ్మెల్యే సీతక్క
మరోవైపు మంగపేట మండలం బాలన్న గూడెం, ప్రాజెక్టునగర్ సమీప అడవుల్లో గుత్తికోయ గిరిజనులకు భాజపా రాష్ట్ర నాయకులు భూక్యరాజు నిత్యావసరాలు అందించారు. ములుగు ఏరియా ఆస్పత్రిలో నర్సులకు, ఆయాలకు, జంగాలపల్లి చెక్‌పోస్టు వద్ద గస్తీ కాస్తున్న పోలీసులకు ఆర్ఎస్ఎస్ సేవా భారత్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి :200 కుటుంబాలకు తెరాస యువనాయకుల సాయం