తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనుల ఆకలి తీర్చడమే నాకు నిజమైన పండుగ : ఎమ్మెల్యే సీతక్క - ములుగు జిల్లా తాజా వార్తలు

అడవి బిడ్డలకు ఆత్మీయ బంధువు. వారి కష్టాలను తన కష్టంగా భావించి ఆదరించే మాతృమూర్తి. ఆమె వచ్చిందటే వారికి కొండంత ధైర్యం. ఎంతదూరంలో ఉన్న నేనున్నానంటూ తరలివస్తుంది. వారి ఆకలిని తీర్చి ఆదుకుంటుంది. నిత్యం మనం కొలిచే దేవుళ్లు కష్టాల్లో ఆదుకుంటారో లేదో తెలియదు కానీ...గిరిజనుల గుండెల్లో కొలువైన దేవత మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాత్రమే. దీపావళి పర్వదినాన ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఎజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసరాలు పంపిణీ చేశారు.

MLA Seethakka groceries distribution in mulugu Agency villages
గిరిజనుల ఆకలి తీర్చడమే నాకు నిజమైన పండుగ : ఎమ్మెల్యే సీతక్క

By

Published : Nov 14, 2020, 7:27 PM IST

అడవుల్లో ఎక్కడ గిరిజనులు ఉన్నా ఆదుకోవడానికి నేనున్నానంటూ ఎల్లప్పుడు పరితపించే హృదయం ఆ మాతృమూర్తి. కనీస అవసరాలకు నోచుకోలేని అడవి బిడ్డలకు అన్ని తానై ఆదరిస్తుంది. పండగరోజు వారితో ఉంటేనే తనకు నిజమైన పండుగలా భావిస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.

దీపావళి పర్వదినాన ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఎజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాబిన్‌ ఉడ్‌ ఆర్మీ సహకారంతో పోచాపురం, అల్లిగూడెం, నర్సాపూర్, బొల్లాపల్లి గిరిజనులకు సాయమందించారు. కనీస రోడ్డు సౌకర్యాలు లేని వారి వద్దకు కిలోమీటర్ల మేర సరుకులు మోస్తూ వెళ్లి నర్సాపూర్ ఆదివాసీలకు దుప్పట్లు, చీరలు అందజేశారు.

రెండువందల గిరిజన కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రాబిన్‌ ఉడ్ ఆర్మీ ఫౌండేషన్‌ వారికి ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఎజెన్సీ గ్రామాల్లో డీగ్రీలు, పీజీలు చదివినవారు ఉన్నారని...వారికి హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని ఫౌండేషన్‌ నిర్వాహకులకు సీతక్క విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై కేటీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details