ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న జాతర రెండో రోజు భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క సారలమ్మ సన్నిధికి జనాలు పోటెత్తారు. దేవాలయ గేటు 3 మూసివేయటం వల్ల వనదేవతలను భక్తులు బయట నుంచే దర్శించుకుంటున్నారు. గద్దెల లోపల ఉన్న పూజారులు భక్తులకు పసుపుకుంకుమలు అందిస్తున్నారు.
రెండోరోజు మేడారం జాతర... మొక్కులు చెల్లించుకున్న సీతక్క - రెండో రోజు మేడారం జాతర... మొక్కులు చెల్లించుకున్న సీతక్క
రెండోరోజు మేడారం జాతర ఘనంగా సాగుతోంది. వనదేవతలకు దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎమ్మెల్యే సీతక్క కుటుంబసమేతంగా సమక్కసారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రెండో రోజు మేడారం జాతర... మొక్కులు చెల్లించుకున్న సీతక్క
ఎమ్మెల్యే సీతక్క... కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని సీతక్క తెలిపారు. చిన్నచిన్న గిరిజన దేవాలయాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయాలని... రెండేళ్లకో జరిగే పెద్ద జాతరకు నిధులు మంజూరు చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.