తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగులో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు - LOCK DOWN EFFECT

ములుగులో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. పలు గ్రామాల్లోని నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

MLA SEETHAKKA  ATTENDED FOR MAY DAY CELEBRATIONS
ములుగులో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు

By

Published : May 2, 2020, 7:46 PM IST

మే డే సందర్బంగా ములుగులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సీతక్క హజరై... జెండా ఆవిష్కరించారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాధి కారణంగా కార్మికులకు, పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు.

మంగపేట మండలంలోని చింతకుంటకు చెందిన 70 నిరుపేద కుటుంబాలకు, దోమడలోని 180 ఎస్సీ, ఎస్టీ, ముస్లీం కుటుంబాలకు, తిమ్మాపూర్​లోని 80 కుటుంబాలకు, నిమ్మగూడెంలోని 80 కుటుంబాలకు, రోజు వారి కూలీలకు ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఇవీచూడండి:దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details