కరోనా వ్యాప్తి దృష్ట్యా టెస్ట్‌లను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తోన్న కొవిడ్ టెస్ట్ సెంటర్‌ను సందర్శించిన ఆమె జిల్లా వ్యాప్తంగా పరీక్షల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ను ఫోన్లో కోరారు.
కొవిడ్ పరీక్షకేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క
లాక్డౌన్ సందర్భంగా ఆసుపత్రుల వద్ద రోగులు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తోన్న కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆమె జిల్లా వ్యాప్తంగా కరోనా టేస్టుల సంఖ్య పెంచాలని కలెక్టర్‌ను కోరారు.
ములుగులో కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన సీతక్క
గురువారం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ములుగు ఏరియా ఆసుపత్రిలోని రోగులకు, సిబ్బందికి ఒక్కరోజు భోజన వసతిని కల్పించారు. లాక్డౌన్ కారణంగా రోగులు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే సీతక్క భోజన సౌకర్యం కల్పించిన రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:'ప్రజాప్రతినిధులందరూ కరోనా బాధితులకు ధైర్యం చెప్పాలి'