ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు రాష్ట్ర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన, శిశువు మహిళా శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెలిప్యాడ్ ద్వారా చేరుకున్నారు.
వనదేవతలను దర్శించుకున్న మంత్రులు - medaram jatara
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హెలిప్యాడ్ ద్వారా మేడారానికి చేరుకున్నారు. అనంతరం వనదేతలను దర్శించుకున్నారు.
వనదేవతలను దర్శించుకున్న మంత్రులు
దేవాదాయ శాఖ అధికారులు మంత్రులకు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ వన దేవతలు, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించింది. జాతరలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు వచ్చారని సమాచారం.
ఇదీ చూడండి : పంటను కొనుగోలు చేయాలని రోడ్డుపై ఎమ్మెల్యే నిరసన