ములుగు జిల్లాలో మేడారం జాతరలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. జంపన్నవాగు, చిలకలగుట్టలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంకల్పించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతరకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి దర్శనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
మేడారం పనులను పర్యవేక్షించిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి - mulugu district news
మేడారం సమ్మక్క సారలమ్మలను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు దర్శించుకున్నారు. జంపన్నవాగు, చిలకలగుట్టలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![మేడారం పనులను పర్యవేక్షించిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి Ministers who supervised the work of the camp were Srinivas Goud and errabelli at mulugu district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5825294-241-5825294-1579862772251.jpg)
మేడారం పనులను పర్యవేక్షించిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి
మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించబోతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని మంత్రులు, శాసనసభ్యులు కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకునేందుకు ఆహ్వానాలు పలకనున్నామని తెలిపారు.
మేడారం పనులను పర్యవేక్షించిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి
ఇదీ చూడండి : 'అమీన్పూర్ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'