Ministers in Medaram Jatara: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు స్పష్టం చేశారు. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సత్యోవతి రాఠోడ్ పనులు పురోగతిపై ఆరా తీశారు. అనంతరం జాతర ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి మంత్రులు రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని.. వసతులు పెరిగాయని మంత్రులు తెలిపారు. గడచిన నాలుగు జాతరలకు రూ. 332 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 18న సీఎం కేసీఆర్... జాతరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. సంప్రదాయాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.
TSRTC Buses: మేడారం జాతరను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కాలనీల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎలాంటి అదనపు డిపాజిట్ లేకుండానే సమ్మక్క- సారలమ్మ గద్దెల వరకు ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సు కావాలనుకునేవారు 30 మందితో ఒక బృందంగా ఏర్పడితే వారున్న ప్రాంతం నుంచే మేడారానికి ప్రత్యేక బస్సు నడపనున్నారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకునేవారు www.tsrtconline.in ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రాబోయే పెళ్లిళ్ల సీజన్ సందర్బంగా ఎలాంటి అదనపు డిపాజిట్ లేకుండా ఆర్టీసీ బస్సును అద్దెను తీసుకోవచ్చని ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. మీ సమీపంలోని డిపో అధికారులను, సమీపంలోని బస్ స్టేషన్ లోని సూపర్ వైజర్లను సంప్రదించి బస్సులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.