మేడారం మహా జాతరను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సందర్శించారు. తన అనుచరులతో అమ్మవార్లను దర్శించుకున్నారు. టవర్ క్లాక్పై నుంచి జాతర నిర్వహణ తీరును పరిశీలించారు. భక్తులను ఉద్దేశించి మంత్రి సూచనలిచ్చారు.
మేడారం జాతరలో భక్తులకు మంత్రి సూచన - మేడారం మహా జాతర వార్తలు
తోటి భక్తులకు ఇబ్బంది కలిగించరాదని, భక్తులు తొందర తొందరగా దర్శనం చేసుకుంటూ సంతోషంతో వెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఈరోజు మేడారం మహా జాతరను మంత్రి సందర్శించి భక్తులను ఉద్దేశించి సూచనలిచ్చారు.
మేడారం జాతరలో భక్తులకు మంత్రి సూచన
తోటి భక్తులకు ఇబ్బంది కలిగించరాదని, భక్తులు తొందర తొందరగా దర్శనం చేసుకుంటూ సంతోషంతో వెళ్లాలన్నారు. అమ్మవారి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయన్నారు. అందరి కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భక్తులు ఉత్సాహంతో జై సమ్మక్క... జై సారాలమ్మ అంటూ జేజేలు పలికారు.
ఇదీ చూడండి :తల్లి మందలించిందని... తనువు చాలించింది