ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. జాతర ప్రాంతం, జంపన్న వాగు వద్ద, ఊరట్టం లెవెల్ బ్రిడ్జ్ వద్ద నుంచి చిలకలగుట్ట వరకు జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్నాన ఘట్టాల వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాప్‌లను జనవరి 10 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిలుకల గుట్టకు పోయే సీసీ రోడ్డును పరిశీలించారు. మేడారం వచ్చిన మంత్రి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకున్నారు.
మేడారంలో పర్యటించిన సత్యవతి.. పనుల పరిశీలన - సత్యవతి రాఠోడ్ తాజా వార్త
ములుగు జిల్లా మేడారం జాతర జరిగే ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గిరిజన, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు.
మేడారం ప్రాంతంలో పర్యటించిన మంత్రి సత్యవతి రాఠోడ్