Minister seethakka on Prajapalana in Mulugu :ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట మండలం రాఘవపట్నం వద్ద భారీ వర్షాలకు కొట్టుకుపోయిన దయ్యాల వాగు బ్రిడ్జి ఇరువైపుల రోడ్లను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్ పరిశీలించారు. వచ్చే సంవత్సరం జరగబోయే మేడారం జాతర సందర్భంగా రోడ్డు మర్మమతులు త్వరగా చేపట్టాలని మంత్రి సీతక్క ఆధికారులను ఆదేశించారు. అనంతరం మేడారం(Medaram) జాతరకు వచ్చే నిధులలో రూ. 40 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు.
జీహెచ్ఎంసీలో రెండో రోజు భారీగా అభయహస్తం దరఖాస్తులు - ఎక్కువగా వాటి కోసమే
Minister seethakka Visits Mulugu for Prajapalana : బ్రిడ్జి రోడ్లను పరిశీలించిన అనంతరం, మంత్రి సీతక్క మండలంలోని పస్రా గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రజలకు మంత్రి వివరించారు. కాంగ్రెస్(Congress) పార్టీ చేపట్టిన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాడ్వాయి మండలంలోని అడవిలో నివసిస్తున్న మొండాల తోగు గొత్తి కోయగూడానికి మంత్రి సీతక్క వెళ్లి గిరిజనుల వద్ద దరఖాస్తులను స్వీకరించారు.