ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోతు కవితలు బతుకమ్మ చీరలను సమర్పించారు. అనంతరం స్థానిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి - telangana tribal minister satyavathi rathode
సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆడపడుచులకు దసరా కానుకగా అందించే.. బతుకమ్మ చీరలను మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోతు కవిత మేడారం సమ్మక్క- సారలమ్మలకు సమర్పించారు. అనంతరం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రిష్ణాదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఏటూరునాగారం పీఓ హన్మంత్, ములుగు ఏఎస్పీ సాయి చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారిణి రమాదేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి:ఉపాధి కోసం 60 ఏళ్ల మహిళల 'సాగర సాహసాలు'