ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్స్‌పై చికిత్స, వైద్య సదుపాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే జరుగుతున్నాయని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మారుమూల జిల్లాలో మౌలిక వసతులు ములుగు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాయని... దీనికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు. ములుగు, జాకారం, ఏటూరు నాగారంలో నేడు వంద మంది కొవిడ్ రోగులు ఆక్సిజన్ ద్వారా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇక్కడి నుంచి.. బయటకు పంపకుండా ఇక్కడే వసతులు ఏర్పాటు ఉండటం నిజంగా సంతోషకరమని పేర్కొన్నారు.
మంత్రి అభినందనలు
కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. వైద్య యంత్రాంగం చేస్తున్న పనులకు మంత్రి అభినందించారు. ప్రజలు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ లాక్డౌన్ విధించారని మంత్రి అన్నారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
20 లక్షల విలువైన వైద్య పరికరాలు
జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్స్ మంజూరు అయ్యాయని.. వాటి పనులు త్వరితగతిన చేపడతామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. జిల్లా ప్రజల సౌకార్యర్థం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో డిస్టిక్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ తన బ్యాచ్‌కు చెందిన గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో రూ .20 లక్షల విలువైన వైద్య పరికరాలను సమకూర్చారు. వాటిని మంత్రి సత్యవతిరాథోడ్ , ఎమ్మెల్యే సీతక్క , జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా దావాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్‌కు అందించారు.