ములుగు జిల్లాలో గిరిజన, శిశు, మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోతు కవిత పర్యటించారు. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని వనదేవతలకు చీరలు సమర్పించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాఠోడ్... మహిళలతో బతుకమ్మ ఆడారు.
'రాష్ట్ర ఆడపడుచులందరికీ సీఎం కేసీఆర్ అన్నయ్యారు' - mp maloth kavitha visit
ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోతు కవిత పర్యటించారు. ములుగులో కలెక్టరేట్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
minister satyavathi ratod and mp maloth kavitha distributed bathukamma sarees
రాష్ట్ర ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఒక అన్నలా బతుకమ్మ చీరలను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. సమ్మక్క- సారక్క దీవెనల వల్లనే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాను అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్... అనేక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. తెరాస ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, పీఓ హనుమంతు జడంగే, ఏఎస్పీ సాయి చైతన్య, ఆర్డీఓ రమాదేవి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.