రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులను ఆవిడ ప్రారంభించారు.
ములుగు మండలం మల్లంపల్లిలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన భూమిని ఆమె పరిశీలించారు.
గిరిజన జనాభా అధికంగా ఉన్న కారణంతోనే.. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని మంత్రి పేర్కొన్నారు. యూనివర్శిటీ కోసం 350ఎకరాల భూమిని సర్వే చేసి సిద్ధంగా ఉంచామని తెలిపారు.
భాజపా నిర్లక్ష్య ధోరణితో.. రెండేళ్ల క్రితమే ప్రారంభం కావాల్సిన తరగతులు ఇంకా మొదలు కాలేదంటూ సత్యవతి మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచైనా సరే త్వరితగతిన పనులు ప్రారంభించేలా పోరాటం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో పల్లి ధర.. ఆనందంలో రైతన్న