ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలో రూ. 46 లక్షల వ్యయంతో నిర్మిస్తోన్న జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ భవనానికి మంత్రులు సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోతు కవిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు నూతనంగా ఏర్పడ్డ ములుగు జిల్లాలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ. 55 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
సంక్షేమ శాఖ కార్యాలయానికి మంత్రుల శంకుస్థాపన - మంత్రి సత్యవతి రాఠోడ్ తాజా వార్తలు
నూతనంగా ఏర్పడ్డ ములుగు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ రూ. 55 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర మంత్రులు సత్యవతీ రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ మాలోతు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గట్టమ్మ సమీపంలో నిర్మిస్తున్న జిల్లా సంక్షేమ శాఖ భవనానికి వారు శంకుస్థాపన చేశారు.
ములుగు జిల్లా సంక్షేమ శాఖ భవనానికి శంకుస్థాపన
ములుగు పట్టణంలోని డిగ్రీ కళాశాల సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సహా పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిజ్జా క్యాంటీన్‌ను మంత్రులు ప్రారంభించారు.
ఇదీ చదవండి:'ధాన్యం కొన్న పదిరోజుల్లో డబ్బు ఖాతాలో జమ చేస్తాం'