ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటు తెచ్చేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు.
ములుగు ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభించిన సత్యవతి రాఠోడ్ - తెలంగాణ తాజా వార్తలు
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ను ఎంపీ మాలోతు కవితతో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కేంద్రంలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో వెనకబడిన ప్రాంతాలైన ములుగు, సిరిసిల్ల జిల్లాలు పైలెట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని.. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:TS News: ఆ ఆసుపత్రులకు లైసెన్సులు పునరుద్ధరించారు..