గట్టమ్మను దర్శించుకున్న గిరిజన శాఖ మంత్రి సత్యవతి - గట్టమ్మను దర్శించుకున్న గిరిజన శాఖ మంత్రి సత్యవతి
గిరిజన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మను మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
![గట్టమ్మను దర్శించుకున్న గిరిజన శాఖ మంత్రి సత్యవతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4526090-172-4526090-1569223433720.jpg)
ములుగు జిల్లాలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పర్యటించారు. ప్రేమ్‌నగర్ సమీపంలోని గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని చీరలు సమర్పించారు. అనంతరం తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లకు చీరలు అర్పించారు. గిరిజన శాఖ మంత్రి అయినందుకు గిరిజన మహిళగా.. ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నానని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులందరి అభిప్రాయాలు తీసుకుని అమ్మవార్ల మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు.