తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో గోదావరి జలాల కోసం నివేదిక సిద్ధం చేయండి: సత్యవతి రాఠోడ్ - కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్ష

ములుగు కలేక్టరేట్​లో మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కృషి చేస్తానని... అందుకోసం అధికారులు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. కలెక్టరేట్​లో విజిటర్స్​ హైల్, ఆర్​ అండ్​ బీ అతిథి గృహం మంత్రి ప్రారంభించారు.

minister sathyavathi ratode review in mulugu collectorate
జిల్లాలో గోదావరి జలాల కోసం నివేదిక సిద్ధం చేయండి: సత్యవతి రాఠోడ్

By

Published : Nov 9, 2020, 10:59 PM IST


ములుగు జిల్లాను సస్యశ్యామలంగా చేసే విధంగా సమగ్ర నివేదిక తయారు చేసి సీఎం కేసీఆర్​కు సమర్పించనున్నట్టు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. జిల్లాలో చివరి గుంట వరకు నీరు అందించే విధంగా కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్​లోని విజిటర్స్ హాల్, ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్ ప్రారంభించి... దేవాదుల ఎత్తిపోతల పథకం, మైనర్ ఇరిగేషన్, ఎస్సారెస్పీపై సమీక్ష నిర్వహించారు. ములుగులో ప్రతి ఎకరాకి గోదావరి నీరు తీసుకువచ్చేందుకు నివేదిక రూపొందించాలని అధికారులను కోరారు.

ప్రతి మండలానికి ఒక ప్రణాళిక ఉండేలా, పనులు సత్వరం జరిగే విధంగా చూడాలన్నారు. రామప్ప బ్యాక్ వాటర్ వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇబ్బంది జరిగినందున అందరూ సహకరించాలన్నారు. మైనర్ ఇరిగేషన్, ఇతర నీటి పారుదల శాఖలో ఎవరి పరిధిలో వచ్చే ఆయకట్టు ఎంత వరకు అనేది స్పష్టంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్​పర్సన్​ కుసుమ జగదీశ్​, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


ఇదీ చూడండి:గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో సునీల్

ABOUT THE AUTHOR

...view details