ములుగు జిల్లా ఏటూరు నాగారం కమ్యునిటీ హెల్త్ సెంటర్లో కరోనా వార్డును గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(sathyavathi rathod) ప్రారంభించారు. ఆస్పత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్టంలో కొవిడ్ నియంత్రణలో ఉందని అన్నారు. వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వం ఉండొద్దన్నారు.
sathyavathi rathod: కొవిడ్ వార్డు ప్రారంభించిన మంత్రి
ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్టంలో కొవిడ్ నియంత్రణలో ఉందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్(sathyavathi rathod) అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం కమ్యునిటీ హెల్త్ సెంటర్లో కరోనా వార్డును ప్రారంభించారు.
sathyavathi rathod: కొవిడ్ వార్డు ప్రారంభించిన మంత్రి
కొవిడ్ బారిన పడ్డ వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. లాక్డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయన్నారు. కొవిడ్ విజృంభన ఆపేందుకే లాక్డౌన్ విధించారని తెలిపారు. మంత్రితో పాటు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్, ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 3,527 కరోనా కేసులు, 19 మరణాలు