తెలంగాణ

telangana

ETV Bharat / state

వానాకాలం పంట ప్రణాళికపై జిల్లా అధికారుల సమావేశం - పంట ప్రణాళిక

వానాకాలంలో వేయాల్సిన పంటల గురించి ములుగు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలని, ఇందుకు రైతులను సమాయత్తం చేసేందుకు అధికారులు రంగంలోకి దిగాలని మంత్రి సత్యవతి రాథోడ్​, ఎంపీ కవిత అన్నారు.

Minister Sathyavathi Meeting With District Agriculture Officers
వానాకాలం పంట ప్రణాళికపై జిల్లా అధికారుల సమావేశం

By

Published : May 23, 2020, 9:00 PM IST

ములుగు జిల్లా ములుగు మండల కేంద్రంలోని జాకారంలో జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత వానాకాలం పంట ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులంతా ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలని, ఇందుకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి సత్యవతి రాథో​డ్​ అన్నారు. గోదావరి లోయల్లో పండిస్తున్న మిర్చి పంట కోసం కోల్డ్​ స్టోరేజ్​, ప్రతి మండలానికి ఒక గోదాము ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించి రైతులకు ప్రభుత్వం సూచించిన పంటల మీద అవగాహన కల్పించాలని అన్నారు.

సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్న విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేని యెడల అధికారులు మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు.లాక్​డౌన్​ సడలించినంత మాత్రాన కరోనా పూర్తిగా తగ్గిపోయినట్టు కాదని.. ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులు పంట వేయాలని ఎంపీ మాలోత్​ కవిత అన్నారు. కంది, పత్తి, సోయాబీన్​, పెసర వంటి పంటలు వేసి లాభాలు గడించాలని కోరారు.

ఇదీ చదవండి:ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details