ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని గిరిజనుల కోసం జిల్లా పోలీసులు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వెంకటాపూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో 6 గూడెంలలో నివసిస్తున్న 150 కుటుంబాలకు చెందిన 600 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్, ఏఎస్పీ సాయి చైతన్య, ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్ పాల్గొన్నారు.
గిరిజనులందరికీ ములుగు పోలీసులు తోడుగా ఉంటారని ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్ తెలిపారు. అడవి ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల్లో చాలామందికి ఆరోగ్యం దెబ్బతింటోందని, మహిళలకు రక్తహీనత లోపాలు ఉన్నాయని డాక్టర్ జగదీశ్ అన్నారు. పౌష్టికాహారం లోపం వల్లనే చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించారు.