ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజు గద్దెపైకి రాగా.. 6న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెకు చేరుకుంది. లక్షలాది మంది భక్తులు తరలొచ్చి.. మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు వచ్చారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని పరవశించిపోయారు.
అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖులు
జాతర కోసం ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అమ్మవార్లను రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.